భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న అడిలైడ్ డే/నైట్ టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆసీస్ బ్యాటర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో ఆసీస్.. 55 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఇక క్రీజ్లో పాతుకుపోయిన మార్నస్ లబుషేన్ (62)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్కు పంపాడు. ప్రస్తుతం క్రీజ్లో ట్రావిస్ హెడ్ 26*, మిచెల్ మార్ష్ 0* ఉన్నారు.