పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. దీంతో ఆఫ్‌స్టంప్ ఆవల పడే బంతులను ఆడటంలో విఫలమవుతున్నాడంటూ నెట్టింట విమర్శలు వస్తున్నాయి. అయితే, వాటిని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కొట్టిపడేశాడు. టెస్టు క్రికెట్లో కోహ్లీ 9 వేలకుపైగా పరుగులు చేశాడని.. కంగారు పడాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించాడు. కొన్నిసార్లు ఔటైనంత మాత్రాన ఏం అవుతుంది? అని పేర్కొన్నాడు.