SRD: అమీన్పూర్ దర్శన్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీవాసులు ఆదివారం ఎమ్మెల్సీని విన్నవించారు. త్రాగునీరు, సీసీ రోడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్సీ జీహెచ్ఎంసీ డీఈ వెంకటరమణతో మాట్లాడి రోడ్లు, త్రాగునీటి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసి సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.