ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల ఇ-కామర్స్ సంస్థ మింత్రా క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. ‘ఎం-నౌ’ పేరుతో బెంగళూరులో సేవలను ప్రారంభించింది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు మింత్రా CEO నందితా సిన్హా తెలిపారు. ఎం-నౌ సేవల్లో భాగంగా ఆర్డరు పెట్టిన 30 నిమిషాల్లోనే డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవల ద్వారా ఇప్పటివరకు 10వేల ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని, త్వరలో ఒక లక్షకు పెంచనున్నట్లు వెల్లడించారు.