W.G: కొవ్వూరు పట్టణంలో యువకుడు బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చందన్ బెహరా కొవ్వూరు థియేటర్ సెంటర్ సమీపంలో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియ రాలేదు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.