BDK: తెలంగాణ ఉద్యమకారుడు మోరే భాస్కర్‌రావు శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ బుధవారం మరణించారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కొత్తగూడెం ప్రాంతం నుంచి ఆయన కీలక పాత్ర పోషించారు. 2001లో KCR ప్రారంభించిన TRS పార్టీ తరఫున ఈ ప్రాంతం నుంచి కీలక నేతగా పనిచేశారు. వార్డు కౌన్సిలర్‌గా, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు.