»Tsrtc Conductor Committed Suicide In Bus At Thorrur
TSRTC బస్సులోనే కడ్డీకి వేలాడిన ఆర్టీసీ కండక్టర్
రిజిస్టర్ (Register)లో సంతకం చేసి లోపలికి వెళ్లాడు. వెళ్లిన వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆయన లోపల ఎక్కడా కనిపించకపోవడంతో డిపో అంతా ఉద్యోగులు గాలించారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు.
మంచి ప్రభుత్వ ఉద్యోగం.. భార్య, పిల్లలు సాఫీగా సాగుతున్నాయి. అయితే వచ్చే ఆదాయం (Income) సరిపోక అప్పుల (Debts) బారిన పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. కుటుంబానికి తిప్పలు వచ్చి పడ్డాయని ఆయన భావించాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఆయన తన ప్రాణాన్ని తీసుకున్నాడు. పని చేస్తున్న బస్సులోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. అతడి ఆత్మహత్యతో తెలంగాణ ఆర్టీసీ (Telangana State Road Transport Corporation-TSRTC)లో విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) తొర్రూరు (Thorrur) మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన గార్లపాటి మహేందర్ రెడ్డి (54) తొర్రూరులోని టీచర్స్ కాలనీలో కుటుంబంతో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య అరుణ, ఇద్దరు కుమారులు. 1993లో ఆర్టీసీ కండక్టర్ (RTC Conductor)గా విధుల్లో చేరాడు. అయితే ఇటీవల కొంతకాలంగా ముభావంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మూడు రోజులు సెలవులు (Leaves) తీసుకున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ అకస్మాత్తుగా సెలవులను రద్దు చేసుకుని ఆదివారం విధులకు హాజరయ్యాడు. తొర్రూరు డిపోకు మధ్యాహ్నం 12 గంటలకు విధుల్లో చేరేందుకు ఉదయం 10 గంటలకే వచ్చాడు. రిజిస్టర్ (Register)లో సంతకం చేసి లోపలికి వెళ్లాడు. వెళ్లిన వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆయన లోపల ఎక్కడా కనిపించకపోవడంతో డిపో అంతా ఉద్యోగులు గాలించారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఇక బస్సుల్లో వెతుకుతుండగా ఓ బస్సులో మహేందర్ రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బస్సు (RTC Bus)లోని కడ్డీకి వేలాడుతుండడాన్ని చూసి ఉద్యోగులు హతాశులయ్యారు.
వెంటనే అతడిని కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహేందర్ రెడ్డి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణం సంస్థలో వేధింపులు కాదని స్పష్టమైంది. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతడి మృతికి ఆర్టీసీ డిపో ఉద్యోగులు, తోటి సిబ్బంది నివాళులర్పించారు.