వరంగల్: కాళేశ్వరం గోదావరిలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వారి వివరాలు.. టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన సమ్మక్క (50) గత నెల 27న ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోమవారం గోదావరిలో తేలి ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానిక గంగపుత్రులు పోలీసులకు సమాచారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమ్మక్క మృతదేహంగా గుర్తించారు.