TG: సంగారెడ్డి జిల్లా డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తాపడింది. ఈ సంఘటన కోహిర్ మండలం వెంకటాపూర్ కూడలి వద్ద చోటుచేసుకుంది. డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తాపడటంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.