బివిఆర్ పిక్చర్స్ బ్యానర్ పై 'భారీ తారాగణం'(Bhaari Taaraganam) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని డైరెక్టర్ శేఖర్ ముత్యాల తెరకెక్కిస్తున్నారు. ఇందులో సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని బివి.రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్(Teaser), పాటలు విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (Movie Trailer)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
బివిఆర్ పిక్చర్స్ బ్యానర్ పై ‘భారీ తారాగణం'(Bhaari Taaraganam) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని డైరెక్టర్ శేఖర్ ముత్యాల తెరకెక్కిస్తున్నారు. ఇందులో సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని బివి.రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్(Teaser), పాటలు విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (Movie Trailer)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘భారీ తారాగణం’ మూవీ ట్రైలర్:
https://www.youtube.com/watch?v=Q59uDwv2XC0
ట్రైలర్ లాంచ్(Trailer Launch) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krishnareddy) హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మంచి బలం ఉన్న కథాంశంతో ‘భారీ తారగణం'(Bhari Taaraganam) సినిమా తెరకెక్కినట్లు తెలిపారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు మంచి సంగీతాన్ని అందించారన్నారు. ఈ మూవీలో కమెడియన్ ఆలీ(Ali) మంచి పాత్రలో ఒదిగిపోయాడన్నారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకున్నారు.
ఆలీ(Ali) మాట్లాడుతూ..ట్రైలర్(Trailer) చూస్తుంటే తనకు చాలా కొత్తగా అనిపించిందన్నారు. ఈ సినిమాలో మంచి పాత్రలో చేశానన్నారు. ఈ సినిమా దర్శకనిర్మాతలకు బిగ్ హిట్ కావాలని కోరుకున్నారు. ఈ సినిమాలో నిర్మాత అచ్చిరెడ్డి అన్న తమ్ముడు సదన్ హీరోగా చేస్తున్నాడన్నారు. ఇలాగే సదన్ మంచి సినిమాల్లో నటించి పెద్ద హీరో కావాలని ఆశించారు.