TPT: శ్రీకాళహస్తి మండలం ఓటుగుంట ఎస్టీ కాలనీలో శనివారం రాత్రి యువకుడు రవిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, రవిని వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. రవి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన స్వస్థలం వెంకటాపురం కాగా ఏడేళ్లుగా ఓటుగుంట ఎస్టీ కాలనీలో ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.