KMR: బీర్కూరు మండల కేంద్రంలోని KGVPలో పలు ఖాళీలు ఉన్నట్లు వార్డెన్ గీత ఒక ప్రకటనలో తెలిపారు. బీర్కూర్ KGVPలో పీజీసీఆర్టీ గణితం, పీజీసీఆర్టీ కెమిస్ట్రీ ఖాళీగా ఉన్నాయన్నారు. పార్ట్ టైం బోధకులు కావాలని, సోమవారం సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. వేతనం 23000 వరకు ఉంటుందని, బీఎడ్, పీజీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.