TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 10 విమానాలు రద్దు అయినట్లు విమానాయాన శాఖ అధికారులు వెల్లడించారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. విమానాలు హఠాత్తుగా రద్దు కావడంతో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.