16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించే చట్టానికి ఆస్ట్రేలియా సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. దీంతో ఇకపై అక్కడి పిల్లలు టిక్ టాక్, ఫేస్ బుక్, స్నాప్ చాట్, X, ఇన్‌స్టాగ్రామ్‌లను వినియోగించలేరు. ఈ చట్టం ప్రకారం పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేయకపోతే వారికి 33 మిలియన్ డాలర్ల వరకు జరిమానాను విధిస్తారు.