TG: ములుగు జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు అయింది. ములుగు నియోజకవర్గ పరిధిలో మల్లంపల్లిని మండలం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.