TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఆఫీసులో రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ పెద్దలు, కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎంలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం.