AP: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంచ్ శాశ్వత భవన నిర్మాణానికి ఏడాదిన్నర పట్టొచ్చని అన్నారు. ఆరు నెలల్లోనే బెంచ్ ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం స్థల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ‘వైసీపీ ప్రభుత్వం న్యాయరాజధాని పేరుతో ప్రజల్ని మోసం చేసింది. లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాలూ కర్నూలులోనే ఉంటాయి. కర్నూలు నుంచి కార్యాలయాల తరలింపు అనేది వైసీపీ దుష్ప్రచారమే’ అని పేర్కొన్నారు.