TG: దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీపై వస్తున్న వార్తలపై BRS MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఆ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఉన్నత పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలని, ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఒకవేళ ఆ కంపెనీలో తమకు భాగస్వామ్యం ఉన్నట్లు రుజువు చేస్తే.. ఆరోపణలు చేసిన వ్యక్తులకే అప్పగిస్తానని ప్రకటించారు.