విదేశీ విమాన ప్రయాణికులకు మాల్దీవులు ‘ఎగ్జిట్ ఫీజు’ వసూలు చేస్తోంది. డిసెంబర్ 1 నుంచి ఎగ్జిట్ ఫీజు, విమాన తరగతి బట్టి ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఎకానమీకి 30 డాలర్ల నుంచి 50 డాలర్లకు (రూ.4220) పెంచింది. అలాగే, బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు 60 డాలర్ల నుంచి 120 డాలర్లకు పెంచింది. ఇతర విమాన ప్రయాణికులకు సైతం ఛార్జీలు భారీగా పెరగనున్నట్లు సమాచారం.