జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ కావడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలకు కొడాలి నాని నిర్మాతగా వ్యవహరించారనే సంగతి తెలిసిందే. అదుర్స్ సినిమా వరకు జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య అనుబంధం కొనసాగింది. ఆ తర్వాత పొలిటికల్ కారణాలు, ఇతర కారణాల వల్ల తారక్, కొడాలి నాని కలిసి కనిపించలేదు.
అయితే తారక్, కొడాలి నాని మధ్య గ్యాప్ మాత్రం లేదని ఆయన సన్నిహితులు చెబుతారు. తాజాగా కొడాలి నాని తారక్ గురించి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. టీడీపీలో తనకు సీటు ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్ అని కొడాలి నాని తెలిపారు. ఈ రీజన్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ నన్ను తిట్టినా, చంపినా ఎదురుమాట్లాడనని కొడాలి నాని చెప్పుకొచ్చారు. వల్లభనేని వంశీ కూడా తాజాగా తారక్ గురించి పాజిటివ్ గా స్పందించారు.
జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా పడతామని కొడాలి నాని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని కొడాలి నాని, వల్లభనేని వంశీ కోరుకుంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నట్టు లేరు. మరోవైపు టీడీపీలో ఇదే పరిస్థితి కొనసాగితే జూనియర్ ఎన్టీఆర్ కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా సక్సెస్ కావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఆయన నిజంగా రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. తారక్ తర్వాత ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటికే కన్ఫ్యూజన్ నెలకొంది. ఇదే సమయంలో రాజకీయాలకు సంబంధించిన వార్తల ద్వారా తారక్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తారక్ కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.