Telangana Cabinet భేటీ.. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ప్రాధాన్యం
telangana cabinet:తెలంగాణ మంత్రివర్గ (telangana cabinet) సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ (cm kcr) అధ్యక్షతన జరగనుంది. వివిధ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) నేపథ్యంలో సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) ఈడీ (ed) విచారణ కోసం ఢిల్లీ వెళ్లడం.. మంత్రివర్గ సమావేశం నిర్వహించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
Telangana Cabinet:తెలంగాణ మంత్రివర్గ (telangana cabinet) సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ (cm kcr) అధ్యక్షతన ప్రగతి భవన్లో జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) నేపథ్యంలో సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) ఈడీ (ed) విచారణ కోసం ఢిల్లీ వెళ్లడం.. మంత్రివర్గ సమావేశం నిర్వహించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు ఎమ్మెల్సీ (mlc) స్థానాల కోసం అభ్యర్థుల ఖరారు, ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, ఆర్థిక వనరుల రాబడిపై చర్చ, దళిత బంధు (dalitha bandhu) , సొంత జాగా ఉన్నా వారికి 3 లక్షల రూపాయల ఆర్దిక సహాయం, ఉద్యోగుల డి.ఏ, పీఆర్సిపై డిస్కష్ చేస్తారు. అర్హులకు ఇళ్ల స్థలాల పట్టా పంపిణీ.. అర్హులకు ఇళ్ల స్థలాల పట్టా పంపిణీపై చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వ పరిణామాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.