TG: ఫుడ్‌పాయిజన్ ఘటనపై మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వరుస ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని అన్నారు. కనీస చర్యలకు ఉపక్రమించడం లేదంటూ మండిపడ్డారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపుతామన్న.. సీఎం రేవంత్ మాటలు నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు.