బాలీవుడ్ స్టార్లు అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యా రాయ్ బచ్చన్ జంట విడాకులు తీసుకోనుందని కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నటి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ రిలేషన్లో ఉన్నట్లు బాలీవుడ్ కోడై కూస్తున్నది. తాజాగా అభిషేక్ దీనిపై జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఐశ్వర్య తల్లిగా పలు బాధ్యతలు తీసుకుందని, తల్లి అయిన తరువాత తన కెరీర్‌ను త్యాగం చేసిందన్నాడు. ఐశ్వర్య కూతురు ఆరాధ్యతోనే ఇంట్లో ఉంటుందని తెలిపాడు.