రష్యా విమానంలో మంటలు చెలరేగాయి. అందులోని ప్రయాణికులు, సిబ్బంది ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడ్డారు. టర్కీలోని అంటాల్య విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. రష్యాలోని అజిముత్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుఖోయ్ సూపర్‌జెట్ ప్యాసింజర్ విమానం గాలి దుమారానికి ప్రభావితమైంది. దీంతో విమానాశ్రయంలో ల్యాండింగ్ సందర్భంగా విమానం ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. విమానంలో 89 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.