దేశవ్యాప్తంగా ఢిల్లీ మినహా మిగిలిన నగరాల్లో CNG ధర పెరిగింది. కిలోకు రూ.2 చొప్పున పెంచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ నగరానికి మినహాయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈనెల 22 నుంచి ఎంజీఎల్ రూ.2 పెంచింది. దీంతో కేజీ CNG ధర రూ.77కు చేరింది. CNG ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి.