సిద్ధార్థ్ హీరోగా ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన లవ్ డ్రామా సినిమా ‘మిస్ యు’. ఈ మూవీ ఈనెల 29న తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడారు. తాను ఇప్పుడు తెలంగాణ అల్లుడిగా ఇక్కడ నిలబడ్డానని అన్నారు. తన జీవితంలోకి అదితి రూపంలో దేవత వచ్చిందన్నారు. ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానని, 2024 ఏదైనా మంచి జరిగిందంటే అది తన పెళ్లి అని సంతోషం వ్యక్తం చేశారు.