ముంబై మారణహోమానికి సరిగ్గా ఇవాళ్టికి 16 ఏళ్లు గడిచాయి. 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు ముంబైలోని CSMT, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ ఘటనలో 18 మంది భద్రత సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. భద్రత బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను 2012 నవంబర్ 21న ఉరితీశారు.