TG: జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు కేంద్ర ప్రభుత్వమే 90 శాతం నిధులు ఇస్తుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ప్రజా విజయోత్సవాల్లో నవంబర్ 26న అన్ని గ్రామ పంచాయతీల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. సర్క్యులర్ జారీ చేయడం ఆశ్చర్యంగా ఉంది.’ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.