TG: పెద్ద చదువుల కోసం గురుకులాల్లో చేరిన గిరిజన బిడ్డను బలి తీసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 20 రోజులుగా నిమ్స్‌లో ఉన్న విద్యార్థినిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించలేదని మండిపడ్డారు. కనీసం మెరుగైన వైద్యం అందించాలని కూడా వైద్యులను ఆదేశించలేదన్నారు. గురుకులాల్లో భద్రంగా ఉండాల్సిన అమాయక విద్యార్థులు నేల రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.