AP: సోలరైజేషన్ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 132 గ్రామాలను సోలార్ విలేజెస్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 100 శాతం సౌర విద్యుత్ నియోజకవర్గంగా కుప్పం ఎంపికైనట్లు చెప్పారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలతో గరిష్ఠ లబ్ధి పొందాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇల్లు, కార్యాలయం సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలని తెలిపారు.