AP: CBRN మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు విమ్స్ డైరెక్టర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం మేరకు అనుమతులిస్తూ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాద బాధితులకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.