AP: రాష్ట్రంలో సంక్రాంతి నాటికి రూ.861 కోట్లతో చేపట్టిన పాత్ హోల్ ఫ్రీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆర్అండ్బీ శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించి మాట్లాడారు. 1,307 కి.మీ. పొడవైన 18 స్టేట్ హైవేలను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నరేగా నిధులతో గ్రామాల్లో 13 వేల కి.మీ. అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడుతామని పేర్కొన్నారు.