పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మేకర్స్ ఈ మేరకు పవన్ షూట్లో పాల్గొన్న ఓ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోలో పవన్ క్యాప్ టీ షర్ట్ ధరించి ఫైట్ కోసం సిద్ధమైన స్టీల్‌ను చూడవచ్చు. ఎడమ చేతికి బ్యాండెజ్ కట్టుకుని ఉన్న పవన్ కల్యాణ్ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మూవీ ప్రీ షెడ్యూల్ ఇటీవల నిర్వహించగా… అందులో పాల్గొన్న పవన్ చిత్రాన్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. మొఘలులు, కుతుబ్ షాహీల కాలంలో జరిగిన ఓ బందిపోటు స్టోరీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా…క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.