»Anand Mahindra Brutally Trolled For Sharing This Video
Anand Mahindra: నీటిపై గుర్రం పరుగు.. వీడియోపై నెటిజన్ల ఆగ్రహం!
ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఫోటోలు అందరి మన్ననలు చూరగొంటాయి. అయితే తాజాగా చేసిన ఓ మోటివేషనల్ వీడియో పైన మాత్రం కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
మహీంద్రా అండ్ మహీంద్రా (mahindra and mahindra) చైర్మన్ (Chairman) ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో (Social Media)… ముఖ్యంగా ట్విట్టర్ లో (Twitter) చురుగ్గా ఉండటంతో పాటు మోటివేషనల్ కు (Motivational videos) సంబంధించిన పోస్టులు షేర్ చేస్తుంటారు. ఆయన షేర్ చేసే వీడియోలు, ఫోటోలు అందరి మన్ననలు చూరగొంటాయి. అయితే తాజాగా చేసిన ఓ మోటివేషనల్ వీడియో పైన మాత్రం కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు. నీటిపై పరుగు పెడుతున్న ఓ గుర్రం వీడియోను ఆయన పోస్ట్ చేశారు. 11 సెకన్లు కలిగిన ఈ వీడియోలో గుర్రం నీటి పైన పరుగు పెడుతుంటే… పడవలో ఉన్న వారు వీడియో తీసినట్లుగా ఉంది. దీనిని ఆయన షేర్ చేశారు. ‘ఏ పని చేయాలన్నా మన మీద మనకు నమ్మకం ఉండాలి. విశ్వాసం ఉంటే మీరు నీటిపై కూడా నడువవచ్చు. అంతా మీ సంకల్పంలోనే ఉంది. మీ కలల సాకారం కోసం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి’ అంటూ మోటివేషనల్ సందేశంతో కూడిన వీడియోను పోస్ట్ చేసారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
మీరు ఇలా సూచించడానికి ముందు (నీటిపై నడక) మీరు అలా ప్రయత్నించి చూపండి అని ఓ నెటిజన్, మీరు కూడా నీటి పైన నడవలేరని, కాబట్టి వాస్తవమయ్యే కలలను ప్రోత్సహించండి.. ఉదాహరణకు బోట్ కొనుగోలు వంటి వాటిని చూపించాలని మరో నెటిజన్ సూచించాడు. మీ మహీంద్రా కార్లతో ఇలా నీటిపై ప్రయాణించడం ట్రై చేయాలని మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. అదే సమయంలో మంచి మోటివేషనల్ వీడియో అంటూ చాలామంది ప్రశంసించారు.
You too can walk on water if you believe you can. It’s all in the mind. 😊 Start your week believing in yourself and your aspirations. #MondayMotivation pic.twitter.com/qh6h3mEVtw
ఇలా, నెటిజన్ల కామెంట్స్ పైన స్పందించిన ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మరో పోస్ట్ పెట్టారు. నీటిపై నడవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మల్టీ టాస్క్ చేయవద్దు అంటూ చురకలు అంటించారు. అంటే అది కేవలం మోటివేషనల్ వీడియో అనే యాంగిల్ అందులో కనిపిస్తోంది.
😄 Moral of the story: Don’t Multi-task when trying to walk on water. https://t.co/pHLTrHQhTZ
అంతకుముందే, ‘చల్తీకా నామ్ బిల్ గేట్స్ కి గాడీ’ అంటూ ఓ వీడియో షేర్ చేశారు. భారత పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ (bill gates) ఇక్కడి రోడ్ల పై ఓ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను (electric auto rickshaw) నడిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇది. బిల్ గేట్స్ మరోసారి భారత్ కు వచ్చిన సమయంలో మీరు, నేను, సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కలిసి.. 3-వీలర్ డ్రాగ్ రేస్ లో పోటీ పడదామని ప్రతిపాదించారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 131 కిలో మీటర్లు ప్రయాణించే ఓ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను (EV Rickshaw) బిల్ గేట్స్ (Bill Gates) నడిపారంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన నడుపుతున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో చల్తీ కా నామ్ గాడీ అనే బాలీవుడ్ పాట వస్తోంది. ఈ ఫోటోను ఆనంద్ షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
“Chalti ka Naam Bill Gates ki Gaadi” So glad you found the time to check out the Treo @BillGates Now on your next trip’s agenda should be a 3-wheeler EV drag race between you, @sachin_rt and me… pic.twitter.com/v0jNikYyQg