కేంద్ర ప్రభుత్వం పై మంత్రి కేటీఆర్ (Minister KTR) మరోసారి ఫైర్ అయ్యారు. శ్రీలంకలో (Srilaka) అదానీ (Adhani) ప్రాజెక్టు పై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ఎ మిత్ర్ కాల్ (A Mitr Kaal)’ లో ‘వన్ నేషన్.. వన్ ఫ్రెండ్ (ఒకే దేశం.. ఒకే మిత్రుడు)’ అనేది కొత్త పథకమని కేటీఆర్ అన్నారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టును ఆ దేశ ఆర్థిక మంత్రి ‘ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం’గా అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వం పై మంత్రి కేటీఆర్ (Minister KTR) మరోసారి ఫైర్ అయ్యారు. శ్రీలంకలో (Srilaka) అదానీ (Adhani) ప్రాజెక్టు పై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ఎ మిత్ర్ కాల్ (A Mitr Kaal)’ లో ‘వన్ నేషన్.. వన్ ఫ్రెండ్ (ఒకే దేశం.. ఒకే మిత్రుడు)’ అనేది కొత్త పథకమని కేటీఆర్ అన్నారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టును ఆ దేశ ఆర్థిక మంత్రి ‘ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం’గా అభివర్ణించారు. ఈ మేరకు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పత్రికా క్లిప్పింగ్స్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారు. అదానీకి ప్రాజెక్టును కట్టబెట్టాలంటూ ప్రధాని మోదీ తమను బలవంత పెట్టారని గతంలో శ్రీలంక చేసిన వ్యాఖ్యలను కూడా మంత్రి గుర్తుచేశారు. ప్రధాని మోదీ సర్కారు తమ పాలనా కాలాన్ని అమృత కాలమని చెప్పుకోవడం, వన్ నేషన్.. వన్ పెన్షన్, వన్ నేషన్.. వన్ రేషన్‌కార్డ్ లాంటి పథకాలను తీసురావడాన్ని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ తనదైన శైలిలో ట్విటర్లో (Twitter) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమృత కాలాన్ని ఎ మిత్ర్ కాల్‌గా కేటీఆర్ అభివర్ణించారు. వన్ నేషన్ .. వన్ ఫ్రెండ్ (One Nation .. One Friend)అనేది ఎ మిత్ర్ కాల్లో కొత్త పథకమని తెలిపారు.