»Nara Lokesh Open Challenge To Ys Jagan Over Election
Nara Lokesh: జగన్కు నాలా పోటీ చేసే దమ్ముందా?
వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పుకోవడం కాదని, దమ్ముంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress) ఇప్పటి వరకు గెలవని చోట పోటీ చేసి, గెలిచే సత్తా ముఖ్యమంత్రికి (Chief Minister of Andhra Pradesh) ఉందా? అని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సోమవారం సవాల్ విసిరారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పుకోవడం కాదని, దమ్ముంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress) ఇప్పటి వరకు గెలవని చోట పోటీ చేసి, గెలిచే సత్తా ముఖ్యమంత్రికి (Chief Minister of Andhra Pradesh) ఉందా? అని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సోమవారం సవాల్ విసిరారు. మంగళగిరి నియోజకవర్గంలో (Mangalagiri Assembly constituency) గతంలో తెలుగు దేశం పార్టీకి (Telugudesam Party) ఏమాత్రం పట్టు లేదని గుర్తు చేసారు. అలాంటి చోట తాను ధైర్యం చేసి పోటీ చేశానని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అయినా ఇక్కడి నుండి తాను పోటీ చేసి, మంగళగిరిని (Mangalagiri) టీడీపీ కంచుకోటగా మారుస్తానని చెప్పారు. లోకేష్ చెప్పినట్లు మంగళగిరిలో టీడీపీకి పట్టు లేదనే చెప్పవచ్చు. 1983లో తెలుగు దేశం పార్టీ పుట్టినప్పటి నుండి ఇక్కడ తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే, కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. అది కూడా పార్టీ పుట్టిన తర్వాత వరుసగా రెండుసార్లు గెలిచింది. ఆ తర్వాత దాదాపు మూడున్నర దశాబ్దాలుగా టీడీపీ తేలిపోయింది. అక్కడ ఆ పార్టీకి పట్టు లేదు. 1983, 1985లలో వరుసగా రెండుసార్లు టీడీపీ నుండి ఎంఎస్ఎస్ కోటేశ్వర రావు విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాలుగుసార్లు గెలిచింది. 1994లో ఓసారి సీపీఐ(ఎం) విజయం సాధించింది. ఆ తర్వాత 2014, 2019లో వరుసగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుండి గెలిచారు. అయితే ఈ రెండుసార్లు కూడా టీడీపీ అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయింది. 2014లో కేవలం 12 ఓట్లు, 2019లో 5వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే ఆళ్ల బయటపడ్డారు. బలం లేని చోట తాను వచ్చేసారి గెలిచి చూపిస్తానని, జగన్ కు ఆ దమ్ముందా అని సవాల్ విసరడం గమనార్హం.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుపై…
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పైన (Global Investors Summit) కూడా లోకేష్ స్పందించారు. రాష్ట్రంలో తీవ్రవాద పాలన కొనసాగుతుందని పారిశ్రామికవేత్తలు చెప్పారని, ప్రముఖ కంపెనీలు బైబై ఏపీ అంటున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు నిల్ అయ్యాయన్నారు. కానీ గంజాయి మాత్రం ఫుల్ అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. ఇప్పటికే ఒప్పందాలు జరిగిన కంపెనీలతో మళ్లీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఎంవోయూలు కుదుర్చుకొని, యువతను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ చేస్తోందని దుయ్యబట్టారు. దావోస్ ఒప్పందాలను మళ్లీ విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చూపించారని ఆరోపించారు. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదని, లోకల్ ఫేక్ సమ్మిట్ అని ఎద్దేవా చేశారు. ఏబీసీ కంపెనీ టర్నోవర్ రూ.120 కోట్లు అని, అలాంటి కంపెనీ లక్షా 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఎలా పెడుతుందో చెప్పాలన్నారు. రూ.లక్ష క్యాపిటల్ ఉన్న ఓ కంపెనీ రూ.76వేల కోట్లు పెట్టుబడి పెడుతుందా అని నిలదీశారు. వైసీపీ పాలనలో పీపీఏలు రద్దు చేయడంతో పాటు రాష్ట్రం నుండి పరిశ్రమలను తరిమేశారన్నారు. పీపీఏలు రద్దు చేయవద్దని కేంద్రం హెచ్చరించినా జగన్ వినిపించుకోలేదన్నారు. చంద్రబాబు హయాంలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయన్నారు. జగన్ పాలనలో మాత్రం భారతి సిమెంట్స్ మాత్రమే బాగు పడిందన్నారు.