కార్పొరేట్ ఆఫీసులకు సంబంధించిన వింత రూల్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఆర్డర్ ఒకటి వైరల్ అవుతోంది. కంపెనీ ఆర్డర్లో డిసెంబర్ 31 వరకు సెలవు తీసుకోరాదని తెలిపింది. అనారోగ్యం పాలైనప్పటికీ సిక్ లీవ్ తీసుకోవడం నిషేధించడిందని పేర్కొంది. ఇందుక కారణం ఈ సమయంలో పని ఎక్కువగా ఉంటుందని అందుకే సెలవులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. అయితే ఈ రూల్ ఏ కంపెనీ వారు పెట్టారన్న విషయం ఇంకా తెలియరాలేదు.