Samantha : లవ్యూ.. నువ్వంటే చెప్పలేనంత ఇష్టం.. అంటూ సమంత పోస్ట్.. ఎవరి గురించో తెలుసా?
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత.. అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా తను పెట్టిన ఆ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నువ్వంటే ఇష్టం.. అంటూ సమంత చెప్పుకొచ్చిన మాటలు ఎవరికోసం అంటారా?
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి సమంత ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. వ్యక్తిగతంగా, సినిమాల పరంగా, ఆరోగ్య పరంగా తను చాలా ఇబ్బందులు వచ్చాయి. అయినా అన్నింటినీ తట్టుకొని నిలబడి ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికీ సమంత.. అదే స్టార్ హోదాను అనుభవిస్తోంది. తన జీవితం డిస్టర్బ్ అయినా, తనకు అరుదైన వ్యాధి సోకినా ఏమాత్రం భయపడకుండా సమంత ముందుకెళ్తోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత.. అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా తను పెట్టిన ఆ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నువ్వంటే ఇష్టం.. అంటూ సమంత చెప్పుకొచ్చిన మాటలు ఎవరికోసం అంటారా? నాగ చైతన్య కోసం కాదు లేండి.. తన బెస్ట్ ఫ్రెండ్ నందినీ రెడ్డి కోసం. నందినీ రెడ్డి టాలీవుడ్ డైరెక్టర్ అని తెలుసు కదా. తన పుట్టిన రోజు సందర్భంగా ఎమోషనల్ అయిన సమంత ఆ పోస్ట్ ను షేర్ చేసింది.
Samantha : నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి
నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. నీలాంటి వాళ్లు ఉంటే.. బాధలు, కష్టాలు అస్సలు రావు. బాధ వచ్చినా నవ్విస్తావు.. బాధలోనూ నిన్ను చూస్తే రిలాక్స్ అవుతాను. నువ్వు లేకపోతే నా జీవితం ఎలా ఉండేది. నువ్వంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. లవ్యూ.. హ్యాపీ బర్త్ డే అంటూ తనతో కలిసి దిగిన ఫోటోతో పాటు ఈ మెసేజ్ ను పోస్ట్ చేసింది సమంత.
నిజానికి.. సమంత, నందినీ రెడ్డి మధ్య స్నేహం జబర్దస్త్ సినిమాతో స్టార్ట్ అయింది. అప్పుడే కదా.. సిద్ధార్థ్ తో సమంత లవ్ లో పడింది. ఆ తర్వాత బ్రేకప్ కూడా చెప్పేశారని వార్తలు వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే.. సమంత, నందినీ రెడ్డి కాంబోలో ఇటీవల ఓ బేబీ అనే సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం సమంత చేతిలో ఒక వెబ్ సిరీస్ ఉంది. ఖుషీ అనే సినిమాలోనూ నటిస్తోంది. తన వ్యాధికి చికిత్స చేయించుకుంటూ ఉండటం వల్ల తన సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే తను ఆ వ్యాధి నుంచి బయటపడుతోంది.