దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash Reddy) విచారణ సంస్థ సీబీఐ(CBI) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తోంది. తాజాగా అవినాష్ కు మరోసారి షాకిచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులలో(CBI notices) పేర్కొన్నది సీబీఐ. హైదరాబాద్ (Hyderabad) సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది.

పులివెందులలో ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించింది. సోమవారం తప్పనిసరిగా విచారణకు రావాలని సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని రెండుసార్లు విచారించింది సీబీఐ. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy)కి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అతనికి తొలుత 12 న హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన సీబీఐ, ఆ తర్వాత 6వ తేదీనే రావాలని పేర్కొన్నది. తాను అరో తేదీన విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి చెప్పగా.. తప్పనిసరిగా రావాల్సిందే అని తేల్చి చెప్పింది. జనవరి 28, ఫిబ్రవరి 24న సీబీఐ.. అతనిని రెండు పర్యాయాలు విచారించింది.