శరీరం, మూడ్ రీఫ్రెష్ అవ్వాలంటే టీ తాగేందుకు ఆసక్తి చూపుతారు. అయితే టీలో చాలా రకాలున్నాయి. వీటిల్లో హెర్బల్ టీలు మంచి పరిమళంతో ఉండటమే కాక ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి శక్తి అందుతుంది. గుండె జబ్బులు రావు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. నాడీవ్యవస్థ మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.