నారాయణపేట: కోస్గిలో నేటి నుంచి వారం పాటు జరగనున్న గ్రామ సభలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీఓ శ్రీధర్ తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు ఎంపీడీఓ, తహశీల్దార్, మండల విద్యాధికారి, వ్యవసాయ అధికారి తదితరులు కేటాయించబడ్డారు. సభల్లో ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించనున్నారు.