Deepika కు అరుదైన గౌరవం.. ఆస్కార్ వేదికపై ఇండియన్ హాట్ బ్యూటీ!
Deepika : ప్రస్తుతం యావత్ భారత దేశం మొత్తం.. మార్చి 12న జరగనున్న 95వ అకాడమీ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తోంది. మన దేశం తరపున అధికారిక ఎంట్రీ లభించకపోయినా.. దర్శక ధీరుడు రాజమౌళి, ఆస్కార్ నామినేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిలిపి.. చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు.
ప్రస్తుతం యావత్ భారత దేశం మొత్తం.. మార్చి 12న జరగనున్న 95వ అకాడమీ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తోంది. మన దేశం తరపున అధికారిక ఎంట్రీ లభించకపోయినా.. దర్శక ధీరుడు రాజమౌళి, ఆస్కార్ నామినేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిలిపి.. చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసమే 50 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు టాక్. ఇప్పటికే నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబల్ అవార్డ్ అందుకుంది కాబట్టి.. ఆస్కార్ రావడం పక్కా. అందుకే ఆర్ఆర్ఆర్ టీమ్ మెంబర్స్ అమెరికాలో సందడి చేస్తున్నారు. ఆస్కార్ వేదిక పై నాటు నాటు సాంగ్ లైవ్ ఫర్ఫార్మెన్స్ కూడా ఇవ్వనున్నారు సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్. అయితే వీరితో పాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిపిక పదుకొనే కూడా ఆస్కార్ వేడుకకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. తాజాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది దీపికా. ఈసారి ఆస్కార్ వేడుకలో అవార్డ్స్ ప్రజెంటర్‌గా దీపికాకు ఆహ్వానం అందింది. ప్రజెంటర్స్ లిస్ట్‌లో డ్వేన్ జాన్సన్, ఎమిలీ బ్లంట్, రిజ్ అహ్మద్, శ్యామూల్ ఎల్ జాక్సన్, గ్లెన్ క్లోజ్, మైఖేల్ బి జోర్డాన్, జోనాథన్ మేజర్స్ లాంటి హాలీవుడ్ ప్రముఖలున్నారు. వీళ్లతో కలిసి అవార్డ్స్ ప్రజెంట్ చేయబోతోంది దీపికా. గతంలో 2016 ఆస్కార్స్ ఈవెంట్లో ప్రియాంక చోప్రా బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విజేతగా అవార్డును అందజేసింది. దాంతో ఆస్కార్ అవార్డ్స్ ప్రజెంటర్‌గా వ్యవహరించనున్న రెండో ఇండియన్ నటిగా దీపికా పదుకోనే నిలవనుంది. ఇకపోతే.. రీసెంట్గా పఠాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది దీపికా.. బికినితో కుర్రకారును ఊపేసింది.. అంతేకాదు దీపిక బికినీ పలు వివాదాలకు దారి తీసింది.