మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద అస్వస్థతకు గురయ్యాడు. దాంతో ఆయన ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేసి.. తిరిగి ముంబయికి చేరుకున్నారు. అంతకుముందు నటుడికి నాయకులు ఘన స్వాగతం పలికారు. రోడ్‌షో నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే, ఇప్పటి వరకు ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు.