SKLM: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని ఎల్ఎన్పేట జడ్పీటీసీ మాజీ సభ్యుడు శివ్వాల తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని రావిచంద్రి గ్రామంలో శనివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ అమలు చేశారని గుర్తు చేశారు.