యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో ఒప్పందం చేసుకోవడానికి ప్రముఖ బ్రాండ్లు క్యూ కడుతున్నాయి. IPL-2026కు ముందు సూర్యవంశీ ఒక్కో ప్రకటనకు రూ.50 లక్షలు తీసుకునేవాడు. అయితే, ప్రస్తుతం తన పారితోషికాన్ని కోటి రూపాయలకు రెట్టింపు చేసినట్లు తెలుస్తోంది. ఇక వైభవ్ బ్యాట్ స్పాన్సర్షిప్ కోసం ప్రముఖ కంపెనీలు దాదాపు రూ.15 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.