TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దృష్టిని ఏపీపైనే పెడితే బాగుంటుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హితవు పలికారు. రెండు రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ములుగా ఉన్నామని, సభల పేరుతో తెలంగాణలో విద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు కొందరు చూస్తున్నారని, దీనిని పవన్ గమనించాలని ఆయన హెచ్చరించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.