GNTR: జీఎంసీ పరిధిలో ఇళ్ల లెక్కింపును వంద శాతం పూర్తి చేయాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గణన గడువును ఈ నెల 6 వరకు పొడిగించినందున మిగిలిన పనులను పక్కాగా చేయాలన్నారు. దేశ భవిష్యత్ పథకాల రూపకల్పనకు జనాభా గణన డేటానే కీలకమని ఆయన స్పష్టం చేశారు.