విజయవాడలో జరుగుతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్టేడియం పూర్తిగా నిండిపోవడంతో సాయంత్రం 5:30 గంటలకే పోలీసులు గేట్లు మూసివేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి పాస్‌లతో వచ్చిన వేలాది మంది అభిమానులు లోపలికి వెళ్లే వీలులేక పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గేట్ల వద్ద ఫ్యాన్స్ భారీగా పోటెత్తడంతో గందరగోళం నెలకొంది.