భారత్లో ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో తాత్కాలిక రాయబారిగా ఇక్రముద్దీన్ కమిల్ను నియమిస్తూ ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది. తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత భారత్లో ఇదే మొదటి నియామకం కావడం విశేషం. ఈ నియామకం భారత్తో దౌత్య సంబంధాలను బలోపేతం చేస్తుందని అందరూ భావిస్తున్నారు. కాగా ఈ నియామకంపై భారత్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.