ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతలకు సంబంధించిన బ్యాగులు, ఇళ్లనే భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తారని మాజీ సీఎం, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పాల్ఘర్లో సీఎం ఏక్నాథ్ శిండే బ్యాగును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. అంతకుముందు ఉద్ధవ్ ఆరోపణలు ఖండించిన బీజేపీ.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బ్యాగులూ తనిఖీ చేశారని వెల్లడించారు.